Samsung : సామ్‌సంగ్‌ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయి.. ఒకేసారి ఆరు Laptopలు లాంచ్ - వివరాలు ఇవే

Samsung : సామ్‌సంగ్‌ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయి.. ఒకేసారి ఆరు Laptopలు లాంచ్ - వివరాలు ఇవే

టెక్ దిగ్గజం సామ్‌సంగ్‌ ( Samsung ).. భారత్‌లో ఒకేసారి ఆరు ల్యాప్‌టాప్‌లు లాంచ్ చేసింది. గెలాక్సీ బుక్2 సిరీస్‌లో ఐదు తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ గెలాక్సీ బుక్ 2 ప్రో (Samsung Galaxy Book 2 Pro), గెలాక్సీ బుక్ 2 ప్రో 360 (Samsung Galaxy Book 2 Pro 360), గెలాక్సీ బుక్ 2 360 (Samsung Galaxy Book 2 360), గెలాక్సీ బుక్ 2 (Samsung Galaxy Book 2), గెలాక్సీ బుక్ 2 బిజినెస్ (Samsung Galaxy Book 2 Business) ల్యాప్‌టాప్‌లు 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో విడుదల కాగా.. బడ్జెట్ ల్యాపీ సామ్‌సంగ్‌ గెలాక్సీ బుక్ గో (Samsung Galaxy Book Go) స్నాప్‌డ్రాగన్ చిప్‌తో వచ్చింది. విండోస్ 11 ( Windows 11 ) ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇవి వచ్చాయి. గెలాక్సీ బుక్ 2 ప్రో 360, గెలాక్సీ బుక్ 2 ప్రో, గెలాక్సీ బుక్ 2 360 సిరీస్ ల్యాప్‌టాప్‌లు అమోలెడ్ డిస్‌ప్లే, వైఫై 6ఈ లాంటి స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి. గెలాక్సీ బుక్2 ప్రో 360, బుక్2 ప్రో రెండు డిస్‌ప్లే వేరియంట్స్‌లో లాంచ్ అయ్యాయి. సామ్‌సంగ్‌ కొత్త ల్యాప్‌టాప్‌ల ధరలు, వివరాలు, ఆఫర్లు చూడండి.సామ్‌సంగ్‌ బుక్2 సిరీస్, గెలాక్సీ బుక్2 బిజినెస్, గెలాక్సీ బుక్ గో ల్యాప్‌టాప్‌ల ధరలుSamsung Galaxy Book 2 Pro 360 ప్రారంభ ధర భారత్‌లో రూ.1,15,990గా ఉంది. Samsung Galaxy Book 2 Pro ప్రారంభ ధర రూ.1,06,990, Samsung Galaxy Book 2 360 స్టార్టింగ్ ప్రైజ్ రూ.99,990, Galaxy Book Go ప్రారంభ ధర రూ.38,990గా ఉంది. Galaxy Book 2 ప్రారంభ ధర రూ.65,990, Galaxy Book 2 Business ప్రారంభ ధర రూ.1,04,990గా ఉంది.సామ్‌సంగ్‌ గెలాక్సీ బుక్ 2 ప్రో సిరీస్ ప్రీ రిజర్వేషన్లు ఇప్పటికే మొదలయ్యాయి. గెలాక్సీ బుక్ 2 బిజినెస్, గెలాక్సీ గో ల్యాప్‌టాప్‌ల ప్రీబుకింగ్ కూడా సామ్‌సంగ్‌ వెబ్‌సైట్‌లో షురూ అయింది. గెలాక్సీ బుక్2 360, గెలాక్సీ బుక్2 సేల్‌ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రీ రిజర్వేషన్, ప్రీబుకింగ్‌లపై రూ.5000వేల వరకు డిస్కౌంట్, ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి.Also Read:Asus : సూపర్ స్పెసిఫికేషన్లతో ఆసుస్ 2 in 1 Laptop లాంచ్ - స్టైలస్ సపోర్ట్, 9గంటల బ్యాటరీ లైఫ్‌తో Asus Vivobook 13 Slate OLED వచ్చేసిందిSamsung Galaxy Book2 Series స్పెసిఫికేషన్లుసామ్‌సంగ్‌ గెలాక్సీ బుక్2 సిరీస్ ల్యాప్‌టాప్‌లు 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. వీటిలో గెలాక్సీ బుక్2 360 సిరీస్ ల్యాప్‌టాప్‌లు 2 ఇన్ 1గా ఉంటాయి. కీబోర్డు నుంచి వేరు చేసుకొని వీటిని ల్యాప్‌టాప్‌లా వినియోగించుకోవచ్చు. ఇక గెలాక్సీ బుక్ 2 ప్రో, గెలాక్సీ బుక్ 2 సాధారణ ల్యాప్‌టాప్‌లా ఉంటాయి. గెలాక్సీ బుక్2 ప్రో 360, గెలాక్సీ బుక్ 2 ప్రో, గెలాక్సీ బుక్ 2 360.. అమోలెడ్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. గెలాక్సీ బుక్ 2 ప్రో 360, గెలాక్సీ బుక్ 2 ప్రో ల్యాప్‌టాప్‌లు 13.3 ఇంచులు, 15.6 ఇంచుల డిస్‌ప్లే ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చాయి. గెలాక్సీ బుక్2 360.. 13.3 ఇంచుల ఆప్షన్ ఒక్కేటే లాంచ్ అయింది. ఇంటెల్ కోర్ ఐ7, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌ వేరియంట్లలో ఈ ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యాయి.ఈ ల్యాప్‌టాప్‌లకు 1080 పిక్సెల్ ఫుల్ హెచ్‌డీ వెబ్ క్యామ్స్, నాయిస్ క్యాన్సలేషింగ్ ఫీచర్, డాల్బీ ఆట్మోస్ సపోర్టు ఉన్నాయి. గెలాక్సీ బుక్ 2 మోడల్స్ 21 గంల వరకు బ్యాటరీ లైఫ్ వస్తాయని సామ్‌సంగ్‌ పేర్కొంది. అలాగే యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో వీటిని చార్జ్ చేయవచ్చు.Samsung Galaxy Book 2 Business స్పెసిఫికేషన్లు14 ఇంచుల డిస్‌ప్లే, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో గెలాక్సీ బుక్2 బిజినెస్ ల్యాప్‌టాప్‌ వస్తోంది హైబ్రిడ్ వర్క్ కల్చర్ కోసం సామ్‌సంగ్‌ దీన్ని డిజైన్ చేసింది. ఏవైనా సైబర్ ముప్పు వాటిల్లేలా ఉంటే జాగ్రత్త పరిచేలా ట్యాంపర్ అలెర్ట్ ఫీచర్‌తో ఇది వస్తోంది. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తోనే ఈ ల్యాప్‌టాప్‌ నడుస్తుంది. ఇక బుక్2 సిరీస్‌లో ఉన్న కెమెరా, ఆడియో ఫీచర్లు ఇందులోనూ ఉంటాటాయి.Samsung Galaxy Book Go స్పెసిఫికేషన్లు14.4 ఇంచుల డిస్‌ప్లే, సన్నటి బెజిల్స్‌తో గెలాక్సీ బుక్ గో వచ్చేసింది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ అయింది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 7సీ జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ బడ్జెట్ ల్యాప్‌టాప్‌ రన్ అవుతుంది. 180 డిగ్రీలు ఫోల్డ్ చేసేలా హింగ్‌తో వస్తోంది. అలాగే డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంటుంది.Also Read:

Samsung : సామ్‌సంగ్‌ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయి.. ఒకేసారి ఆరు Laptopలు లాంచ్ - వివరాలు ఇవే

Image placeholder

George Washington

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit. Ducimus itaque, autem necessitatibus voluptate quod mollitia delectus aut, sunt placeat nam vero culpa sapiente consectetur similique, inventore eos fugit cupiditate numquam!